పండుగల ఆనందం అందరికీ అందాలనే సంకల్పంతో బాచుపల్లి మాజీ సర్పంచ్ ఆగం పాండు ముదిరాజ్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా వామనులు (మరగుజ్జు ) లకు ,అంతేకాకుండా వారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న యువతకు కొత్త బట్టలు పంపిణీ చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. పండుగ వేళ వారితో ఆనందాన్ని పంచుకుంటూ మానవత్వం, సోదరభావం, సేవా దృక్పథానికి నిదర్శనంగా నిలిచారు.
కేవలం పండుగల సమయంలోనే కాకుండా, తాను నిర్వహించే గణేశ్ ఉత్సవాలతో పాటు ఇతర పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో వామనులకు పాల్గొనే అవకాశాలు కల్పిస్తూ వారిలోని కళా ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. ఉత్సవాల్లో ఆడి పాడేందుకు అవకాశం కల్పించడంతో పాటు ఆర్థిక సహాయం అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు.
సమాజంలో ప్రతి ఒక్కరికీ గౌరవం, సమాన అవకాశాలు లభించాలనే భావనతో ఆగం పాండు ముదిరాజ్ చేస్తున్న ఈ ప్రయత్నాలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. సేవా కార్యక్రమాల ద్వారా పండుగల సంతోషాన్ని అందరితో పంచుకుంటూ, సామాజిక బాధ్యతకు ప్రాధాన్యత ఇస్తున్న ఆయన తీరు ఆదర్శనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పండుగ అంటే సంబరాలే కాదు.. నలుగురి ముఖాల్లో చిరునవ్వులు నింపడం కూడా! ఆగం పాండు ముదిరాజ్ చేపడుతున్న ఈ సేవా కార్యక్రమం ఆ సందేశాన్ని చాటిచెబుతోంది.
Telangana
దసరా వేళ వామనులకు కొత్త బట్టల పంపిణీ..ఆగం పాండు ముదిరాజ్ సేవాభావం
Quick Summary:
ఉత్సవాల్లో కళాకారులకు ప్రోత్సాహం.. ఆర్థిక సహకారంతో అండగా నిలుస్తున్న మాజీ సర్పంచ్