వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు చీమే అనిత శ్రీనివాస్ కుటుంబ సభ్యులు దుర్గామాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు సమర్పించి, గ్రామ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.
గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గ్రామంలో భక్తి సందడి నెలకొంది.
ఈ పూజా కార్యక్రమంలో పూజారి శేషాద్రి, గ్రామ సర్పంచ్ రమేష్ కుమార్, చీమే శ్రీనివాస్, ఈడిగి రమేష్ గౌడ్, అలవోని మొగులయ్య, యాదగిరి, వినోద్ నవ్య శ్రీ, చిమేయాదగిరి తో పాటు తిమ్మాయిపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Telangana
తిమ్మాయిపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజా కార్యక్రమం
Quick Summary:
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో